అజిత్ 62వ మూవీ టైటిల్ విడుదల..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి అజిత్ ఆఖరుగా తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళం లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో తెగింపు పేరుతో విడుదల అయింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా ... తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా ... బోని కపూర్ ఈ మూవీ ని నిర్మించాడు.
 

తునివూ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అజిత్ తాజాగా తన కెరియర్ లో 62 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ కెరియర్ లో 62 వ మూవీ కి  సంబంధించిన సినిమా టైటిల్ ను కూడా మూవీ బృందం విడుదల చేసింది. అజిత్ 62 వ మూవీ కి  చిత్ర బృందం "విద ముయార్చి" అనే టైటిల్ ను ఖరారు చేసింది. అలాగే ఈ మూవీ బృందం ఈ టైటిల్ ని విడుదల చేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించబోతున్నాడు.  ఈ మూవీ కి మగిజ్ తిరుమెని దర్శకత్వం వహించనుండగా ... ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: