దిల్ రాజు నెక్స్ట్ మూవీలు ఏ హీరోలతో అనేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ ప్రొడ్యూసర్ లలో ఒకరు అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు నిర్మాతగా వ్యవహరించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ ప్రొడ్యూసర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే దిల్ రాజు ఈ మూవీ తర్వాత అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరో లతో సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం. దిల్ రాజు మరి కొన్ని రోజుల్లో సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించనున్నాడు.

అలాగే దిల్ రాజు ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఒక మూవీ ని నిర్మించబోతున్నాడు. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక మూవీ ని చేయబోతున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా దిల్ రాజు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరో లతో సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: