మే డే సందర్భంగా "భోళా శంకర్" మూవీ నుండి స్పెషల్ పోస్టర్స్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో అద్భుతమైన విజయం సాధించినటు వంటి వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రూపొంది తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే సిస్టర్ సెంటిమెంట్ ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా ... సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
 

మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
 

ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి మే డే సందర్భంగా కొన్ని పోస్టర్ లను విడుదల చేసింది. ఈ పోస్టర్ లలో చిరంజీవి టాక్సీ లో కూర్చొని అలాగే టాక్సీ పై కూర్చుని అలాగే టాక్సీ పై చెయ్యి వేసుకొని స్టైలిష్ లుక్ లో గ్లాస్ పట్టుకొని ఉన్న మూడు పోస్టర్ లను ఈ చిత్ర బృందం విడుదల చేసింది.
 

ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే వాల్టేర్ వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: