జూనియర్ సహకారం కోసం ఎదురుచూస్తున్న పుష్ప 2 !

Seetha Sailaja
అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ తీసుకు వచ్చి అతడిని ఐకాన్ స్టార్ గా మార్చిన ‘పుష్ప’ కు సీక్వెల్ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. వచ్చేసంవత్సరం సంక్రాంతికి కుదరకపోతే సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ఈసీక్వెల్ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్య హైదరాబాద్ లో జరుగుతున్న ‘పుష్ప 2’ షూటింగ్ స్పాట్ కు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి అక్కడ కొంతసేపు సుకుమార్ అల్లు అర్జున్ తో సమయం గడపడంతో ‘పుష్ప 2’ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నడా అంటూ సోషల్ మీడియాలో గాసిప్పులు పుట్టుకు వచ్చాయి.

వాస్తవానికి సుకుమార్ కు జూనియర్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది సుకుమార్ దర్శకత్వంలో తారక్ ‘మా నాన్నకు ప్రేమతో’ సినిమాను చేసినప్పటి నుండి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ సాన్నిహిత్యంతో జూనియర్ ‘పుష్ప 2’ షూటింగ్ స్పాట్ కు వెళ్ళడా లేదంటే మరేదైనా సినిమా విషయం చర్చించడానికి అక్కడకు వెళ్ళాడా అన్న విషయమై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.

‘పుష్ప’ ఇచ్చిన సూపర్ సక్సస్ తో ‘పుష్ప 2’ ను మరింత భారీ బడ్జెట్ తో సుకుమార్ తీస్తున్నాడు. ఈమూవీని భారీస్థాయిలో మార్కెట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో సినిమాల మార్కెట్ పెంచుకోవడానికి టాప్ బాలీవుడ్ హీరోల సినిమాలలో మరొక బాలీవుడ్ హీరో అతిధిగా నటించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఆమధ్య విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ సాధించిన ‘పఠాన్’ మూవీలో షారూఖ్ ఖాన్ కోరికమేరకు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించాడు.

మన తెలుగులో కూడ చిరంజీవి కోసం సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ మూవీలో అతిధిపాత్రలో నటించిన విషయంతెలిసిందే. అమితాబ్ కూడ చిరంజీవి కోరికమేరకు ‘సైరా’ లో అతిధి పాత్రలో నటించాడు. అయితే ఆప్రయోగాలు తెలుగులో పెద్దగా సక్సస్ కాలేదు.  అయితే బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఒక టాప్ హీరో సినిమాలో మరొక టాప్ హీరో కనిపిస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయోగం సుకుమార్ ఆలోచనలలో ఉందా అన్నది సస్పెన్స్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: