ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

Divya
చియాన్ విక్రమ్ నటించిన నాన్న సినిమా ప్రతి ఒక్కరికి గుర్తు ఉండనే ఉంటుంది. ఇందులో విక్రమ్ ఒక మానసికంగా ఎదగని తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన కూతురు పాత్రలో నటించిన చిన్నారి అందరికీ గుర్తు ఉండనే ఉంటుంది. అంత చిన్న వయసులోనే నటించి ఈ చిత్రంలో ఈమె నటన అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగకుండా ఉండవు.. తండ్రి కూతుర్ల ప్రేమను చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది.

అయితే నాన్న చిత్రంలో నటించిన ఆ చిన్నారి ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.అలాగే అందాల ఆరబోతలో కూడా మైమరిపిస్తోంది. ఈ పాప పేరు సారా అర్జున్. తాజాగా పొన్నియన్ సెల్వన్ -2 చిత్రంలో కూడా నటించింది. వాస్తవానికి మొదటి భాగంలో కూడా నటించిన కానీ చాలా తక్కువ పాత్ర ఉండడంతో ఎవరు పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. కానీ రెండవ భాగంలో కాస్త ఎక్కువగానే కనిపించింది. దీంతో ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఈ పాప మీదనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పోన్నియన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్ర లో ఐశ్వర్యారాయ్ నటించింది. ఐశ్వర్యరాయ్ చైల్డ్ క్యారెక్టర్లలో సారా నటించడం విశేషమని చెప్పవచ్చు.

ఈమె నటనకు అందరూ కూడా మంత్రముగ్ధులయ్యారు చిన్నప్పటి వరకు చిన్న పిల్లలాగా కనిపించిన సార ఇప్పుడు ఒక అందమైన యువతిల కనిపించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు.చిన్న వయసులోనే ఎక్కువగా హీరోయిన్స్ ఛాన్స్ సారాకు వెతుక్కుంటూ వస్తాయని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. సారా అర్జున్ 2011లో చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. హిందీ తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. 2015లో దాగుడుమూత దండాకోర్ అనే చిత్రంలో రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: