2వ రోజు "ఏజెంట్" మూవీకి వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో నటించి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఏజెంట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించగా ... హిప్ హాప్ తమిజా ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సక్సెస్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడం ... సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఏజెంట్ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అలా భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు 4.95 కోట్ల షేర్ ... 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. కానీ ఈ మూవీ కి రెండవ రోజు మాత్రం చాలా తక్కువ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయి. ఈ మూవీ కి రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 81 లక్షల షేర్  ... 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.  ఈ మూవీ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా  5.76 కోట్ల షేర్ ... 10.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: