"దసరా" మూవీ నుండి "ధూం ధాం" ఫుల్ వీడియో సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని ఊర మాస్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ...  శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.
 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ లోని నటనకు గాను నాని కి కీర్తి సురేష్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలకు సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకులను లభించింది. ముఖ్యంగా ఈ మూవీ లోని "ధూం ధాం" సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి "ధూం ధాం" ఫుల్ వీడియో సాంగ్ ను ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: