సాయి తేజ్ కెరీర్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను చేసిన టాప్ 6 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించాడు. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను కూడా వసూలు చేశాయి. అందులో భాగంగా సాయి తేజ్ నటించిన సినిమాలలో హైయెస్ట్ షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 6 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
విరూపాక్ష : సాయి తేజ్ తాజాగా నటించిన ఈ మూవీ ఇప్పటి వరకు 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లోనే ఈ సినిమా 35.12 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి సాయి తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్ట్ లో టాప్ స్థానంలో నిలిచింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు.
ప్రతి రోజు పండగే : సాయి తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమా 34.06 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది.
సుప్రీమ్ : సాయి తేజ్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 25 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
చిత్రలహరి : సాయి తేజ్ హీరోగా రూపొందిన ఈ మూవీ 16.74 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.
విన్నర్ : సాయి తేజ్ హీరో గా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 16 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ : సాయి తేజ్ హీరో గా రెజీనా హీరోయిన్ గ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 15 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sai

సంబంధిత వార్తలు: