ఆ క్రేజీ బ్యానర్లో సల్మాన్ నెక్స్ట్ మూవీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి పూజా హెగ్డే ... సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వెంకటేష్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు.

అలాగే భూమిక చావ్లా కూడా ఈ మూవీ లో కీలక పాత్రలో నటించింది. జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో ఒక సాంగ్.లో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 21 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ దక్కడం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటు.వంటి అజిత్ కుమార్ హీరోగా రూపొందిన వీరమ్ అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇది ఇలా ఉంటే తాజాగా "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన సల్మాన్ ఇప్పటికే తన తదుపరి మూవీ ని కూడా ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న ప్రొడ్యూసర్ లలో ఒకరు అయినటువంటి కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్ లో సల్మాన్ తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: