"బాహుబలి 1" పోలిస్తే "2" కు 1 వరోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు ఎక్కువ వచ్చాయో తెలుసా..!

Pulgam Srinivas
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కంక్లూజన్ మూవీ లు కూడా ఉంటాయి. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా నటించారు. రమ్యకృష్ణ ... నాజర్ ... సత్య రాజ్ లు ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించగా ... దగ్గుపాటి రానా ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే బాహుబలి 1 మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 73.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే బాహుబలి మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి 2 మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అలాగే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆ తర్వాత కూడా ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి. దీనితో బాహుబలి మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం కు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: