2023లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 ఇండియన్ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలకు విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను మొదటి రోజు వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
పఠాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు భారీ కలెక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్టు లో ఫస్ట్ స్థానంలో నిలిచింది.
పొన్నియన్ సెల్వన్ 2 : మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ , జయం రవి , కార్తీ ,  ఐశ్వర్య రాయ్ , త్రిష ప్రధాన పాత్రలలో  రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం విడుదల అయిన మూవీ లలో మొదటి రోజు భారీ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీల లిస్టులో రెండవ వరుసలో నిలిచింది.
వీర సింహారెడ్డి : బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం భారీ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.
వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం మొదటిరోజు భారీ కలక్షన్ లను వసూలు చేసిన మూవీల లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది.
వారిసు : దళపతి విజయ్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్ సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: