SSMB -28 లో విల్లన్ గా స్టార్ హీరో..!!

Divya
ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా నటిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. విలన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు.. ఇతర భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు జగపతిబాబు. ముఖ్యంగా విలన్ పాత్రలలో ఇతర భాషల నుండి తీసుకురావడం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని సినిమాలలో విలన్సుగా స్టార్ హీరోలను నటింప చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇక జగపతిబాబుకు కూడా తెలుగులో వరుస అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్ హిందీ వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు. ఇటీవల తాను పుష్ప-2 సినిమాలో కూడా నటిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ చిత్రంలో జగపతిబాబు విదంగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. పుష్ప -2 చిత్రంతోపాటు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా జగపతిబాబు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో తన పాత్ర కాస్త రాగడ్ లుక్కులో ఉంటుందని తెలిపారు జగపతిబాబు.ఈ మధ్యకాలంలో చేసిన పాత్రలకు మంచి రెస్పాన్స్ లభిస్తూనే ఉంది. అందుకే ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర బాగుంటుందని మహేష్ అభిమానులు కాస్త నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి మహేష్ త్రివిక్రమ్ మధ్య గొడవలు మొదలయ్యాయని అందుకే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోందని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పైన నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్ నుంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు జగపతిబాబు కూడా మహేష్ సినిమాలు విలన్ గా నటించబోతున్నానంటూ తెలియజేయడంతో ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడుతోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: