అప్పుడు విక్రమ్ కూతురిగా.. ఇప్పుడు అదే హీరోకు ప్రేయసిగా?

praveen
ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించినా వారు  ఇప్పుడు పెద్దయ్ ఇండస్ట్రీకి హీరో హీరోయిన్ లుగా పరిచయం అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఒకప్పుడు హీరోల చిన్నప్పటి పాత్రలో లేదా హీరో హీరోయిన్ల కూతురు కొడుకు పాత్రలో నటించిన వారు ఇక ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించి ఏదైనా వార్త సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది హాట్ టాపిక్ గా మారిపోతుంది.

 అయితే ఇలా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చినవారు  వారు కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఇకపోతే పోనియన్ సెల్వన్ 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు సారా అర్జున్. సారా అర్జున్ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ విక్రమ్, అనుష్క జంటగా నటించిన నాన్న సినిమాలో విక్రమ్ కు కూతురుగా నటించిన అమ్మాయి అని చెబితే మాత్రం అందరికీ టక్కున గుర్తు వచ్చేస్తుంది.

 అయితే విక్రమ్ హీరోగా వచ్చిన నాన్న సినిమా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ ఈ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన సారా మాత్రం తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. కొన్ని అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇలా విక్రం కూతురుగా నటించిన ఆ చిన్నారి ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్గా మారిపోయింది. పోనియన్ సెల్వన్ మొదటి పార్ట్ లో  అలా వచ్చి ఇలా మాయపోయినా.. పార్ట్ 2 లో మాత్రం కాస్త నిడివి గల పాత్రలోనే కనిపించి అదరగొట్టింది. చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ గా కరికాలన్ ను ప్రేమించిన నందినిగా సారా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అని చెప్పాలి. అయితే నాన్న సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన సారా ఈ సినిమాలో చిన్నప్పటి విక్రమ్ కు ప్రేయసిగా నటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: