రాఘవ లారెన్స్ రుద్రుడు ఓటీటి లో వచ్చేది అప్పుడే..!!

Divya
రాఘవ లారెన్స్ చాలా సంవత్సరాల తర్వాత హీరోగా నటించిన తాజా చిత్రం రుద్రుడు.. ఈ చిత్రాన్ని కత్తికరేషన్ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కు జోడిగా ప్రియా భవాని శంకర్ నటించింది. శరత్ కుమార్ ఇందులో విలన్ పాత్రలో నటించారు తమిళంలో రుద్రన్ పేరుతో విడుదల చేయగా తెలుగులో రుద్రుడు అనే టైటిల్తో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతమేర విజయం సాధించింది లారెన్స్ మార్కు డైలాగులు ఫైట్లు మాస్ ఫ్యాన్స్ ని మెప్పించాయి. కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టలేదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రిమ్మింగ్ కు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. రుద్రుడు సినిమా డిజిటల్ హక్కులను సైతం ప్రముఖ ఓటీటి సంస్థ అయిన నెట్ ఫ్లెక్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మే 12 లేకపోతే 19వ తేదీన ఓటీటి లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ రిలీజ్ డేట్ పై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.. కథ విషయానికి వస్తే రుద్ర ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉంటారు రుద్ర కుటుంబం పై  పగ పెంచుకున్న శరత్ కుమార్ అతని భార్యతో పాటు తల్లిని కూడా దారుణంగా హత మారుస్తారు ఈ హత్య రుద్ర జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అందకుడి పై రుద్ర ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంటారు అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పట్లాది రాఘవ లారెన్స్ మార్కునైతే చూపించారు కానీ ఈ సినిమా ఎక్కువగా వైలెన్స్ ఉండడం చేత ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం రాఘవ లారెన్స్ చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అలాగే కాంచన చిత్రాల సీక్వెన్స్ లోను కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ప్రేక్షకులను అంతంత మాత్రమే ఆకట్టుకున్న రుద్రుడు సినిమా ఓటీటి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: