అప్పుడు తల్లితో ఇప్పుడు కూతురితో చేస్తున్న మెగాస్టార్....!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీతోనే స్టార్ గా మారలేదు. మొదట్లో ఆయన విలన్ గా నటించి.. ఆ తరువాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
1980లో ఎం రాజశేఖర్ డైరెక్షన్లో వచ్చిన 'పున్నమి నాగు' చిరంజీవి కెరీర్ నే మలుపు తిప్పింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు నరసింహారాజు, రతి అగ్నిహోత్రి, ధూళిపాళ, జయమాలిని, పద్మనాభం తదితరులు నటించారు.
సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. ఒక్కసారి ఇక్కడ ఛాన్స్ వస్తే జీవితమే మారిపోతుందని అనుకుంటారు. అలాంటి అవకాశం కోసం కొందరు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అయితే ఇప్పుడున్న చాలా మంది వారసత్వంతో వచ్చిన వారే. వీరిలో అలనాడు సినిమాల్లో అలరించిన హీరోయిన్ల కూతుళ్లు కూడా ఉన్నారు. అప్పటి నటీమణులు ఇప్పుడు తమ కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే తమ అమ్మాయి స్టార్ అయిపోతుందని భావించి.. టాలీవుడ్ లో ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. అయితే అప్పటి మెగాస్టార్ చిరంజీవితో హీరోయిన్ గా నటించిన ఓ భామ.. ఇప్పుడు తన కూతరును అదే చిరంజీవితో చెల్లెలు నటించడానికి ఒప్పుకుంది. మెగాస్టార్ తో నటించడానికి ఏ అవకాశం వచ్చినా బంగారమే అనడానికి ఇదే నిదర్శనమని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నా. ఇంతకీ ఆ తల్లీకూతుళ్లు ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీతోనే స్టార్ గా మారలేదు. మొదట్లో ఆయన విలన్ గా నటించి.. ఆ తరువాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1980లో ఎం రాజశేఖర్ డైరెక్షన్లో వచ్చిన 'పున్నమి నాగు' చిరంజీవి కెరీర్ నే మలుపు తిప్పింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు నరసింహారాజు, రతి అగ్నిహోత్రి, ధూళిపాళ, జయమాలిని, పద్మనాభం తదితరులు నటించారు. 1980 జూన్ 3న రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నాగులు పాత్రలో నటించారు. ఆయనది హీరో పాత్ర కాకపోయినా మెయిన్ పాత్ర మాత్రం చిరంజీవికే దక్కుతుంది. అయితే చిరంజీవి సరసన పూర్ణిమ పాత్రమే మేనక నటించింది. ఈమె నాగులు కాటుకు బలై చనిపోతుంది.
ఈ మేనక ఎవరో కాదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ తల్లి. మేనక అయ్యంగార్ కన్యాకుమారిలోని నాగర్ కోయిల్ లో జన్మించారు. ఆమె 1979లో తమిళ చిత్రం 'రమాయి వయసుక్కు వస్తుట్టా'తో సినీ ఆరంగేట్రం చేసింది. 1980 నుంచి 1987 వరకు ఆమె మొత్తం 125 సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో 'పున్నమి నాగు'లో నటించారు. ఆ తరువాత 1982లో 'సుబ్బారావుకు కోపం వచ్చింది' సినిమాలో దుర్గ పాత్రలో కనిపించారు. నటిగానే కాకుండా నిర్మాతగా మేనక పలు చిత్రాలను నిర్మించారు.
ఆమె కూతురు కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత 'మహానటి'తో జాతీయ అవార్డు తెచ్చుకున్న కీర్తి సురేష్ కు తెలుగులోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా ఆమె నటించిన 'దసరా' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తల్లి ప్రోత్సాహంతోనే మేనక స్టార్ గా కొనసాగుతుంది.
ఇక అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవితో తల్లి మేనక హీరోయిన్ గా నటించగా.. కూతురు కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది. వీరిద్దరు కలిసి 'భోళా శంకర్' సినిమాలో కనిపించనున్నారు. తమిళ మూవీ 'వేదాళం'కు రీమేక్ అవుతున్నా.. మెగాస్టార్ మెయిన్ రోల్ లోనటించడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. దీనిని ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవితో హీరోయిన్ గా తమన్నా నటించగా కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది. 'భోళా శంకర్' సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: