అఖిల్ "ఏజెంట్" మూవీ "ఓటిటి" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది . ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు .

 ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 28వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి సోనీ లీవ్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సోనీ లీవ్ డిజిటల్ సంస్థ ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు పరవాలేదు అనే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: