అదిరిపోయే రేంజ్ నెక్స్ట్ మూవీల లైనప్ ను సెట్ చేసుకున్న రజినీ..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ , శివరాజ్ కుమార్ , రమ్యకృష్ణ , సునీల్ , జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కాలానిధి మారన్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ ... జై భీమ్ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో రూపొందిపోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత మూవీ ని కూడా రజనీ కాంత్ ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ తర్వాత రజనీ కాంత్ ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు లియో మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో దళపతి విజయ్ హీరో గా నటిస్తూ ఉండగా ... త్రిష ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: