రజిని "జైలర్" మూవీని ఆ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుందా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆయన స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన సినిమా లలో హీరో గా నటించి కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజిని ... నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

 ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ... రమ్యకృష్ణ ... తమన్నా ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చాలా రోజులుగా అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తన్ని కూడా ఇప్పటి వరకు చిత్ర బృందం కూడా ఎప్పుడు ఖండించ లేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన కాకుండా అంత కంటే ఒక రోజు ముందుగా అనగా ఆగస్టు 10 వ తేదీనే విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఆగస్టు 11 వ తేదీన తమిళ హీరో శివ కార్తికేయన్ హీరో గా రూపొందిన మా విరన్ మూవీ ని విడుదల చేయమన్నారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన భోళా శంకర్ మూవీ ని కూడా ఆగస్టు 11 వ తేదీనే విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: