ఆ స్టార్ హీరో సినిమాలో మొదటిసారి అలాంటి పాత్రలో నటించబోతున్న వరలక్ష్మి..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకి చెల్లెలి పాత్రలో నటించిన అప్పటినుండి ఈమెకి మరింత క్రేజ్ పెరిగిపోయింది .ఈ సినిమా కంటే ముందు క్రాక్ సినిమాలో జయము పాత్రలో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ బిగినింగ్ లో పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన.. తన బాడీ ఫిజిక్కి హీరోయిన్గా కంటే విలన్ గానే పాత్రలు సెట్ అవుతాయని భావించిన ఈమె తర్వాత రండి విలన్ పాత్రలలోనే నటిస్తోంది. 

ప్రస్తుతం ఈమె టాలీవుడ్ తో పాటు కోలీవుడ్లో సైతం బడా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.తాజాగా ఈమె తమిళ హీరోకి తల్లిగా చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అది కూడా ఇండస్ట్రీ లోనే మంచి టాక్ ఉన్న హీరోతో అని సమాచారం. ఇక కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో ధనుష్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులు సైతం బద్దలు కావాల్సిందే. ఇటీవల ఆయన హీరోగా నటించిన సార్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో కూల్ క్లాసిక్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ధనుష్ .

ఈ క్రమంలోనే ఆయన తర్వాతే సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ధనుష్ కి తల్లిగా నటించబోతుందని తెలుస్తోంది.ధనుష్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ను తన తల్లిగా నటించమని చిత్ర బృందం ఆమెను సంప్రదించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా కథ బాగుండడంతో తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వార్త విన్నానంతరం వరలక్ష్మి అభిమానులు ఇన్నాళ్లు విలన్ పాత్రలు చేసి ఇప్పుడు పాజిటివ్ రోల్స్ ఉన్న తల్లి పాత్ర చేయడం నీకు సెట్ అవ్వదు అని..విలన్ రోల్స్ చేస్తేనే బావుంటాయి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: