"హిరణ్య కశ్యప" మూవీ నుండి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తప్పకుందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటు వంటి గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు చిరంజీవి హీరో గా రూపొందినటు వంటి చూడాలని ఉంది మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక్కడు మూవీ తో మరో బ్లాక్ బస్టర్ అందుకొని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత పలు మూవీ లకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు కొంత కాలం క్రితం దర్శకత్వం వహించిన రుద్రమదేవి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు దేవి మోహన్ ... సమంత హీరో ... హీరోయిన్ లుగా రూపొందిన శాకుంతలం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు గుణశేఖర్ చాలా సంవత్సరాలుగా హిరణ్య కశ్యప అనే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఈ దర్శకుడు పూర్తి చేశాడు. దాదాపు 300 కోట్లతో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి గుణశేఖర్ ప్రయత్నాలు చేశాడు. శాకుంతలం మూవీ ఎఫెక్ట్ తో ఈ సినిమా నుండి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తప్పుకున్నట్లు ... మరో నిర్మాత కోసం గుణశేఖర్ ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: