సోషల్ మీడియాను షేక్ చేసిన సమంత నవ్వు !

Seetha Sailaja
క్యూట్ హీరోయిన్ గా లక్షలాది మంది అభిమానులు కలిగి ఉన్న సమంత ఎన్ని వ్యతిరేక పరిస్థితులలో పోరాటం చేస్తున్నప్పటికీ సమంతను ఇప్పటికీ ఎందరో అభిమానిస్తున్నారు. ‘శాకుంతలం’ భయంకరమైన ఫ్లాప్ గా మారినా ఆమె అభిమానులు ఏమాత్రం చెక్కు చెదరలేదు అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్ లో కడుతున్న గుడి ఇప్పటికే ఈ గుడి నిర్మాణం చాలావరకు పూర్తి అయినట్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేసాయి.

సమంత పుట్టినరోజునాడు ఆమె లేటెస్ట్ మూవీ ‘ఖుషీ’ లో ఆమె లుక్ కు సంబంధించిన ఒక ఫోటో విడుదలైన కొన్ని క్షణాలలోనే అది వైరల్ గా మారింది. మెడలో ఐడి ట్యాగ్ వేసుకుని బ్లూ కలర్ డ్రెస్ లో నవ్వుతూ కనిపిస్తున్న సమంత నవ్వులో ఎంతో ఫ్రేష్ నెస్ కనిపించింది అంటూ అభిమానులు సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. విజయ్ దేవర కొండతో సమంత కలిసి నటిస్తున్న ఈమూవీ ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీ అన్నప్రచారం జరుగుతోంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ఈమూవీతో తిరిగి ఆమె ట్రాక్ లోకి వస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవర కొండకు కూడ కాలం కలిసి రావడంలేదు. ‘శాకుంతలం’ తో సమంత పని అయిపోయింది అంటూ ప్రచారం జరిగిన పరిస్థితుల మధ్య సమంతకు సంబంధించిన ఒక ఫోటోకు ఇప్పుడు విపరీతమైన ప్రశంసలు వస్తున్న నేపధ్యంలో ఒక్క సరైన హిట్ పడితే చాలు సమంత కెరియర్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

‘శాకుంతలం’ ప్రమోట్ చేస్తున్నంతసేపు సింపతి కోసం తన అనారోగ్యం గురించి ఎన్నో సార్లు చెప్పిన సమంత ‘శాకుంతలం’ విడుదలైన మరుసటి రోజునే లండన్ వెళ్ళి అక్కడ ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్న సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలలో మంచి జోష్ తో కనిపించడంతో ‘శాకుంతలం’ ఫెయిల్యూర్ ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరచలేదు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: