ఆ విషయంలో ఆ హీరోయిన్ సారీ చెప్పిన ఎన్టీఆర్...!!

murali krishna
గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ అయిందో అప్పటినుంచి ఆయన క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది.
కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇతర భాషకు చెందిన ప్రేక్షకులు కూడా ఆయనకు అభిమానులుగా మారారు. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదంతా పక్కనే పెడితే గతంలో ఎన్టీఆర్ ఒక తప్పు చేయటం వల్ల హీరోయిన్ కి సారీ చెప్పినట్లు సమాచారం..
ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే అడుగుపెట్టాడు. చిన్నవయసులోనే ఎన్నో సినిమాలలో అయితే చేశాడు. తర్వాత నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలలో హీరోగా నటించి వరుస సినిమాలతో ఓ రేంజ్ లో అయితే దూసుకెళ్ళాడు. ఇక ఈయనకు యమదొంగ, సింహాద్రి, ఆది, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి పలు సినిమాలు మంచి గుర్తింపును  కూడా అందించాయి. ఇక స్టార్ హోదాలో ఉన్న సమయంలో లక్ష్మీ ప్రణతి ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..ఇక ఎన్టీఆర్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబ సభ్యులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడట.. ముఖ్యంగా తన భార్య పిల్లలకు మాత్రం స్పెషల్ కేర్ అయితే తీసుకుంటాడు. చాలాసార్లు తన భార్య ప్రణతి గురించి, పిల్లల గురించి అభిమానులతో ఆయన పంచుకున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక తప్పు చేసినట్లు ఫీలయ్యి ఓ హీరోయిన్ కి సారీ చెప్పినట్టు సమాచారం.ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన యమదొంగ సినిమలో ఎన్టీఆర్ సరసన ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో తాత సినిమాలోని ఓలమ్మి తిక్కరేగిందా.. అనే సాంగ్ ను అయితే రీమేక్ చేశారు. అయితే ఈ పాటలో మమతా మోహన్ దాస్ బ్యాక్ ను వాయించి వదిలేస్తాడట ఎన్టీఆర్ నిజానికి డైరెక్టర్ చెప్పిన కారణంగానే ఇలా చేశాడు. అయితే ఎక్కడా ఆమె హార్ట్ అయిందో అని పాట కంప్లీట్ అయన తర్వాత ఇంటికి ఫోన్ చేసి మరి ఆమెకు సారీ చెప్పాడట. అయితే ఈ విషయం గురించి అంత సీరియస్ గా తీసుకోకున్నప్పటికీ కూడా సారీ చెప్పిన విధానాన్ని చూసి ఫీదా అయ్యి సో స్వీట్ అని చెప్పుకొచ్చిందట.ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: