"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ టీజర్ విడుదల తేదీ ప్రకటన..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటువంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుష్క ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అలాగే ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అదిరిపోయే హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను కూడా అనుష్క ఫిదా చేసింది.
 

ఇది ఇలా ఉంటే అనుష్క "బాహుబలి" సిరీస్ మూవీ ల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే అనుష్క ఆఖరుగా నిశ్శబ్దం అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించ లేదు. ఇది ఇలా ఉంటే నిశ్శబ్దం మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా మహేష్ బాపు దర్శకత్వంలో రూపొందుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క టీజర్ ను రేపు విడుదల చేయనున్నట్లు  ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ... ప్రమోద్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: