కమల్ ... మణిరత్నం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆ తేదీ నుండే..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటు వంటి లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కెరియర్ లో ఎన్నో వైవిద్యమైన మూవీ లలో హీరో గా నటించి తను నటన తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న లోక నాయకుడు కమల్ హాసన్ ఆఖరుగా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో రూపొందిన పాన్ ఇండియా మూవీ విక్రమ్ లో హీరో గా నటించాడు.

 ఈ మూవీ అద్భుతమైన విజయా న్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. వరుస గా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సంవత్సరాలు 
గా అపజయా లను ఎదుర్కొన్న కమల్ "విక్రమ్" మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయా న్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కమల్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ ... కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు .

 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగం గా జరుగుతుంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత కమల్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కమల్ కెరీర్ లో 234 వ మూవీ గా రూపొంద బోతుంది. ఇది ఇలా ఉంటే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం కమల్ ... మణిరత్నం కాంబినేషన్ లో రూపొందిబోయే మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మే 20 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: