"సైంధవ్" మూవీ నుండి ఆండ్రియా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి ఆండ్రియా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం తమిళ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఆండ్రియా తెలుగు లో కూడా ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించి వాటి ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
 

ఇది ఇలా ఉంటే తెలుగులో ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం నాగ చైతన్య హీరో గా తమన్నా హీరోయిన్ గా రూపొందినటువంటి తడాఖా సినిమాలో సునీల్ కు భార్య పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అండ్రియా వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ "సైంధవ్" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఆండ్రియా కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే ఈ సినిమాలో ఆండ్రియా "జాస్మిన్" అనే పాత్రలో నటిస్తున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఆండ్రియా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో గన్ పట్టుకొని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: