ఏజెంట్ "యూఎస్ఏ" ప్రీమియర్స్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ తాజాగా అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అఖిల్ హీరో గా రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ అంచనాలు కలిగిన మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు.
 

ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు అనగా ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "యు ఎస్ ఏ" లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" హక్కులను "ప్రత్యంగిరా సినిమాస్" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంస్థ భారీ ఎత్తున విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కలెక్షన్స్ కు సంబంధించి ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ద్వారా ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" ప్రీమియర్స్ కు ఇప్పటికే 100 కే ప్లస్ కలెక్షన్ లు వచ్చినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: