మరొక బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిన సమంత..!!

Divya
ఏ ఇండస్ట్రీలో నైనా సెలబ్రిటీలకు స్టార్ ఇమేజ్ ఉంటే ఎక్కువగా బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతూ ఉంటుంది. వారికి కార్పోరేట్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఎక్కువగా వీరిని అనుసరిస్తూ ఉంటారు. ఇలా తమ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసేందుకు కానీ వారికి కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ చెల్లిస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ ,సినీ సెలబ్రెటీల ద్వారా కార్పొరేట్ ఉత్పత్తుల బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రమోట్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సమంత సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నది.

ఎన్నో రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సమంత గత రెండేళ్ల కాలంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదిగి అందరినీ ఆకట్టుకుంటోంది .దేశవ్యాప్తంగా ఇమేజ్ సంపాదించుకున్న సమంత ప్రముఖ స్టాఫ్ డ్రింక్ కంపెనీ పెప్సీ సమంతా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం జరిగింది.తాజాగా సమాంత తో చేసిన పెప్సీ యాడ్ వైరల్ గా మారుతోంది. ఈ యాడ్లో సమంత చాలా డిఫరెంట్ లుక్కులు కనిపిస్తోంది.
ముఖ్యంగా పెప్సీ తాగమని ప్రమోట్ చేస్తూ పెళ్లికూతురు గెటప్పులో మంచి యాక్షన్ హీరోయిన్ లుక్ అన్నట్లుగా కనిపిస్తోంది. పెప్సీ బ్లాక్ ని ముఖ్యంగా ఈ యాడ్ ద్వారా మార్కెట్లోకి ప్రమోట్ చేస్తున్నది సమంత. మొన్నటి వరకు ఈ బ్రాండ్ అంబాసిడర్ కి రాక్ స్టార్ యష్ ఉండగా ఎప్పుడు అతని ప్లేస్ లో సమంత చేరినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు సైతం పెప్సీ బ్రాండ్ కి ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సమంత పాపులర్ కావడంతో ఈ పెప్సీ బ్లాక్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ యాడ్ ద్వారా సమంత నార్త్ మార్కెట్లో ఎంతటి పాపులారిటీ సంపాదిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: