బుచ్చిబాబు చరణ్ ల మూవీ పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
‘ఉప్పెన’ మూవీ సూపర్ సక్సస్ తరువాత బుచ్చిబాబు కు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అతడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి తీరాలి అన్న పట్టుదలతో తనకు వచ్చిన అవకాశాలు అన్నీ వదులుకున్నాడు. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఓకె అన్నప్పటికీ మధ్యలో అతడి అభిప్రాయాలు మారిపోవడంతో బుచ్చుబాబును వదులుకుని ప్రశాంత్ నీల్ వైపు వెళ్ళిపోయాడు.

దీనితో బుచ్చిబాబు షాక్ లోకి వెళ్ళకుండా రామ్ చరణ్ ను తన కథతో మెప్పించాడు. ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కాబోతున్న ఈమూవీ ఒక బయోపిక్ అని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని బుచ్చిబాబు కథను అల్లుకున్నాడు అని అంటున్నారు.
 
భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కోడి రామ్మూర్తి రెజ్లర్ బాడీ బిల్డర్ గా పేరు పొంది అప్పట్లో కింగ్ జార్జ్ ఫైవ్ నుంచి ఇండియన్ హెర్క్యూలెస్ బిరుదును అందుకున్నాడు. అతడు విశాఖపట్నం దగ్గరలో ఉన్న వీరఘట్టం గ్రామంలో పుట్టాడు. చిన్నప్పుడే తల్లి చనిపోతే విజయనగరం వచ్చి ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న అతడి మావయ్య దగ్గర చదువుకుంటూ కుస్తీ పోటీలు మల్ల యుద్ధాల్లో చాల ప్రావీణ్యం సంపాదించాడు. ఏనుగు పాదాన్ని ఛాతి మీద పెట్టించుకోవడంతో పాటు అతడి మీసాలతో బళ్ళు లాగడం లాంటి ఎన్నో సాహసాలు చేసాడు అంటు అతడి గురించి కథలు కథలుగా చెపుతారు.

అతడు మహాత్మాగాంధీ పిలుపు అందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఇలాంటి ఆశక్తికర విషయాలు ఎన్నో కోడి రామ్మూర్తి జీవితంలో ఉన్నాయి. అతడి జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలు సినిమాకు పనికొచ్చే విధంగా మలుచుకుని ఆయన కథను పీరియాడిక్ డ్రామాగా మార్చి డ్యూయల్ రోల్ లో చరణ్ ని చూపించే ప్లాన్ లో బుచ్చిబాబు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు. ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈవార్తలే నిజం అయితే చరణ్ వైపునుంచి మరొక సూపర్ హిట్ ఖాయం అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: