ఎన్టీఆర్ ... త్రివిక్రమ్ యాడ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎవరి సినిమా లతో వారు బిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక యాడ్ షూటింగ్ జరగబోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో ఒక ప్రముఖ కంపెనీ కి సంబంధించిన యాడ్ షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన యాడ్ షూటింగ్ ఇవాళ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒక వేళ ఈ రోజు కనుక ఈ యాడ్ షూటింగ్ జరగనట్లు అయితే మే 2 వ తేదీన లేదా ... మే 3 వ తేదీన ఈ యాడ్ షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: