ప్రభాస్ "ఆది పురుష్" మూవీ ట్రైలర్ రన్ టైమ్ ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా రోజుల క్రితమే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయి ఇప్పటికే చాలా కాలమే అవుతున్న ఈ మూవీ కి భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే  ఈ చిత్ర బృందం ఎక్కువగా సమయాన్ని కేటాయించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా రోజులను కేటాయించిన ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన గ్రాఫిక్స్ పనులను మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన పనులు అన్ని ముగియడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే 4 వ తేదీన గాని ... మే 17 వ తేదీన గాని విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను ఈ చిత్ర బృందం రెడీ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను 3 నిమిషాల 22 సెకండ్ ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: