నాని 30 : షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని అదిరిపోయే ఊర మాస్ పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది.

 నాని నటించిన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను కొల్ల గొట్టి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే దసరా లాంటి భారీ విజయం తర్వాత నాని తన కెరీర్ లో 30 వ మూవీ లో ప్రస్తుతం హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాగూర్ ... నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవా లో జరుగుతుంది. గోవా లో ఈ మూవీ బృందం ఈ సినిమా లోని అత్యంత కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తుంది. దసరా లాంటి భారీ విజయం తర్వాత నాని నుండి రాబోతున్న మూవీ కావడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కి సౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: