"గేమ్ చేంజర్" మూవీలో మరో విలన్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ నటుడు గా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ ఏకంగా రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

 అందులో ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా ... ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీకాంత్ , అంజలి , సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఈ మూవీ లో ప్రధాన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మరో విలన్ పాత్ర కూడా ఉండబోతున్నట్లు ఈ పాత్ర కూడా ఈ సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మరో విలన్ పాత్ర కూడా హైలెట్ గా ఉండడంతో ఈ మూవీ లో బాలీవుడ్ నటుడిని ఆ విలన్ పాత్రలో తీసుకోవాలి అని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలీవుడ్ నటుడు హరి జోష్ ను ఈ మూవీ లో విలన్ పాత్రలో తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకు ఈ నటుడు తెలుగు సినిమాలు అయినటు వంటి బద్రీనాథ్ ... రామయ్య వస్తావయ్య సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: