అఖిల్ లాస్ట్ 5 మూవీల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ తన కెరీర్ లో హీరో గా ఐదు మూవీ లలో హీరో గా  నటించాడు. ఆ 5 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
అఖిల్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.50 కోట్ల ప్రే రిలీజ్ బిజినెస్ జరిగింది.

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కంటే ముందు మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరో గా నటించాడు. నిది అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మిస్టర్ మజ్ను కంటే ముందు అఖిల్ "హలో" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా ... జగపతి బాబు ... రమ్య కృష్ణ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అఖిల్ ... వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందినటువంటి అఖిల్ మూవీ తో హీరో గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: