"ఏజెంట్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో అక్కినేని అఖిల్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమా లలో హీరో గా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ "ఏజెంట్" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ సుంకర ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ రేపు అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కాపుతుంది. దానితో ఈ చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఇప్పటికే క్లోజ్ చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో తెలుసుకుందాం.
ఏజెంట్ మూవీ కి నైజాం ఏరియా లో 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 4.5 కోట్లు ... ఆంధ్ర లో 14.18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ కి 3.80 కోట్ల ప్రియ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్ సీస్ లో 3.80 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్ల షేర్ కలక్షన్ లని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: