బోయపాటి శ్రీను పుట్టినరోజున ఆ పని చేసిన రామ్ పోతినేని..!!

Divya
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. అలాగే సాయి మంజ్రేకర్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తోంది దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నారు. రామ్ గతంలో ది వారియర్ సినిమా విడుదల కాగా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.  ఎలాగైనా ఈసారి కచ్చితంగా సక్సెస్ కొట్టాలని భావిస్తూ ఈ సినిమాలో నటిస్తున్నారు.
తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను పుట్టినరోజు కావడంతో హీరో రామ్ పోతినేని సినిమా సెట్ లోని పుట్టినరోజు సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్ కి హీరో రామ్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. ఏకంగా 80 కేజీల కేకును తెప్పించి బోయపాటి పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. షూటింగ్ సెట్ లో సెలెబ్రేటీలు చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హీరో రామ్ ఏకంగా బోయపాటి 80 కేజీల కేకు తెప్పించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

పలువురు అభిమానులు సైతం రామ్ ఈ సినిమా పైన ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇక బోయపాటి కూడా ఇటీవలే అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు . దీంతో బోయపాటి నుంచి రామ్ మంచి హిట్టు ఆశిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ తో మాసివ్ హిట్టు అందుకున్న రామ్ బోయపాటి మీద ప్రేమతో ఇలా పెద్ద కేకును తెప్పించి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో మాస్ ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: