బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ...!!

murali krishna
శివాజీ తెలుగులో కేవలం హీరోగా మాత్రమే కాకుండా హీరోగా కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాలలో కూడా నటించి మెప్పించారు.
టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సినిమాలలో కూడా నటించి మెప్పించారు శివాజీ. కాగా శివాజీ హీరోగా నటించిన బూచమ్మ బూచోడు సినిమా అప్పట్లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దాదాపుగా ఒక 40 కి పైగా సినిమాల్లో నటించారు.సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లోకి కూడా ఆయన ఎంట్రీ ఇచ్చారు.
భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం కూడా చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివాజీ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూ శివాజీ మాట్లాడుతూ.. నేను టాలీవుడ్ లో హీరోల అందరి సినిమాలలో అయితే నటించాను. నేను నటించిన సినిమాలు నా అదృష్టవశాత్తు అన్నీ కూడా సూపర్ హిట్ గా అయితే నిలిచాయి. అలా నేను టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరోల సినిమాలలో అయితే నటించాను.
నేను నటించిన ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఫ్లాప్ గా నిలిచాయి మిగిలిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ గా నిలిచాయి. బాలకృష్ణ సినిమా ఎలా మిస్సయింది అని యాంకర్ ప్రశ్నించిందట అది నాకు తెలియదు బాలకృష్ణ గారి సినిమాలో సాయికుమార్ గారు చేశారు. నిజానికి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ లో నేను చేయాలి.. ఆ క్యారెక్టర్ చేయడానికి నన్ను పిలిచారు కానీ ఎందుకు ఎవరు ఏమనుకున్నారో తెలియదు కానీ ఆ క్యారెక్టర్ లో సాయికుమార్ గారు నటించారు. అలా బాలకృష్ణ సినిమా అయితే మిస్ అయింది. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారి సినిమాలు అంతగా కుదిరేవి కాదు. నేను ఇండస్ట్రీలో అందరి హీరోలతో నటించాను కానీ బాలకృష్ణగారి తో మాత్రం నటించలేదు అని చెప్పుకొచ్చారు నటుడు శివాజీ. బాలకృష్ణ నన్ను ఎందుకు దూరం పెట్టారు అన్నది ఇప్పటికి అర్థం కావడం లేదు అని తెలిపారు. ఇక శివాజీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: