బెంగళూరు ని కూడా వదలని మహేష్ వ్యాపార విస్తరణ..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు నిజ జీవితంలో ఒక అతిపెద్ద బిజినెస్ మాన్ అని అందరికీ తెలిసిందే.ఆయన నటనతో పాటు సినిమాలను నిర్మిస్తూ మరొక పక్క కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాగే మరోపక్క వ్యాపార రంగంలో కూడా సూపర్ సక్సెస్ అనిపించుకున్న ఈయన బెస్ట్ బిజినెస్ మాన్ గా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ , హోటల్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు బెంగళూరులో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబి సినిమాస్ మొదలుపెట్టిన ఈయన అది సక్సెస్ కావడంతో ఇప్పుడు బెంగళూరులో కూడా ఏ ఎం బి సినిమాస్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.  గాంధీనగర్ బెంగళూరులో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోందని హైదరాబాదు కంటే అక్కడ అదిరిపోయే టెక్నాలజీతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే బెంగళూరు వాసులకు వరల్డ్ క్లాసు సినిమా ఎక్స్పీరియన్స్ ను అందించడానికి సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. ఇకపోతే బెంగళూరులో మల్టీప్లెక్స్ కల్చర్ కి మంచి డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అక్కడ సక్సెస్ అవ్వాలని ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోపక్క వైజాగ్ లో కూడా ఏషియన్ సునీల్ ఏ ఏం బి మల్టీప్లెక్స్ లో ప్రారంభించడానికి కూడా సలహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైమ్ లొకేషన్స్ తో పాటుగా ఇతర రాష్ట్రాలలో కూడా ఏ ఎం బి చైన్ ను విస్తరించే వ్యూహంలోనే ఉన్నారు. ఇకపోతే మరోపక్క అదే ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏషియన్ నమ్రత రెస్టారెంట్ అనే పేరుతో ఒక రెస్టారెంట్ని కూడా ప్రారంభించారు . ఈ రెస్టారెంట్ హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న టిఆర్ఎస్ భవనం పక్కన ఉంటుంది. తన వ్యాపార విస్తరణతో ఆయన మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: