ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఉందంటున్న హాలీవుడ్ డైరెక్టర్..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందంటూ ఏకంగా ఓ హాలీవుడ్ డైరెక్టర్ తన మనసులో మాటను బయట పెట్టాడు. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలో తారక్ నటన అద్భుతమని, అందుకే అతనితో సినిమా చేయాలని ఉందంటూ ఆ హాలీవుడ్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ హాలీవుడ్ డైరెక్టర్ మరెవరో కాదు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్. ప్రస్తుతం ఈయన సూపర్ మ్యాన్: లెగసి మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు జేమ్స్ గన్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఎన్టీఆర్ తో సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

ఒకవేళ ఎవరైనా ఇండియన్ యాక్టర్స్ ని మీ గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..' జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు జేమ్స్ గన్. త్రిబుల్ ఆర్ సినిమాలో ఇంటర్వెల్ సీన్లో వ్యానులో నుంచి పులులు, వన్యమృగాలతో ఎన్టీఆర్ దూకే సీన్ అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు జేమ్స్ గన్. ఇక ఇంటర్వెల్ సీన్లో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించాడని, అందుకే తనకు ఎన్టీఆర్ లాంటి నటుడితో సినిమా చేయాలని ఉందంటూ పేర్కొన్నారు. దీంతో ఈ హాలీవుడ్ డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ మార్కెట్ పాన్ వరల్డ్ స్థాయికి చేరడంతో.. బహుశా ఫ్యూచర్లో ఈ హాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మొత్తం మీద హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ చేసిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో పాటు అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ ప్రస్తుతానికైతే కొరటాల శివ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేయడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: