చిన్న ప్రయత్నం.. పెద్ద విజయం..!

shami
ఒకరిచ్చేదాకా అవకాశాల కోసం ఎదురుచూడటం కాదు మనకి మనమే అవకాశాలు సృష్టించుకోవాలి అనేట్టుగా యువత ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్ లో ఎవరో రావాలి అవకాశం ఇవ్వాలి అనుకుంటూ కూర్చుంటే కాలం ఆగదు అందుకే ప్రయత్నం చేయడం మొదలు పెడితే అవకాశం దానంతట అదే వస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం కుర్రాడు సినిమా మీద ఆసక్తితో షార్ట్ ఫిలింస్ చేస్తూ వచ్చాడు. అదే ఉత్సాహంతో నిర్మాతలను ఒప్పించి ఫీచర్ మూవీ తీశాడు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా అవార్డులతో అదరగొట్టేస్తుంది. తేజ క్రియేషన్స్ బ్యానర్ లో డిటెక్టివ్ డేవిడ్ చాప్టర్ 1 జావీద్ పాషా ఈ మూవీని డైరెక్ట్ చేశారు.
నిజ జీవిత సంఘటన ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా డిటెక్టివ్ డేవిడ్ చాప్టర్ 1 వచ్చింది. 2022 డిసెంబర్ 19న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం లో రిలీజైన ఈ మూవీ ఒకటి రెండు కాదు ఏకంగా 18 అవార్డులను సొంతం చేసుకుంది. గ్రేట్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివ్ల్ లో ఐదు అవార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇండియన్ స్క్రీన్ ప్రాజెక్ట్ లో నాలుగు అవార్డులను పొందింది.
వింగ్స్ ఇంటర్నేషనల్ క్రిటిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా డిటెక్టివ్ డేవిడ్ 1 నాలుగు అవార్డ్ లను దక్కించుకుంది. దీనితో పాటుగా సంగ్రూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా మొత్తం ఐదు కేటగిరిల్లో అవార్డులను అందుకుంది. బెస్ట్ డైరెక్టర్ గా 4, బెస్ట్ స్టోరీ గా 3, బెస్ట్ స్క్రీన్ ప్లే గా 4, బెస్ట్ సినిమాటోగ్రఫీ 3 బెస్ట్ ఎడిటర్ గా 1, బెస్ట్ ఇండ్పెండెంట్ ఫిల్మ్ 2, బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ 1 అవార్డులను అందుకుంది. సూర్య భరత్ చంద్ర లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు వెంకట్ ప్రవీణ్ సినిమాటోగ్రఫీ అందించారు. సరిపల్లి సతీష్, జయశ్రీ శ్రీనివాస్, నజీర్, సిరి దాసరి, రజిని, మస్టర్ యాక్షిత్ లు ఈ సినిమాలో నటించారు. డిటెక్టివ్ డేవిడ్ 1 ఆకట్టుకునే కథ కథనాలతో వచ్చిన ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: