రూ.2 రూపాయలకే జియో ఓటిటి.. ఆ ఓటీటి లకే బ్రేక్ పడినట్టేనా..?

Divya
జియో సినిమాస్ IPL ఫ్రీ టెలికాస్ట్ ఇస్తూ ఉండడంతో మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే మరో నాలుగు ఏళ్ల పాటు జియో ఐపీఎల్ లో ఫ్రీగానే టెలికాస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. దీంతో జియో సినిమాకు వచ్చిన పాపులారిటీ ని క్యాష్ చేసుకోవాలని..OTT సంస్థగా మార్చాలని జియో మేనేజ్మెంట్ చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోని ఇటీవల జియో స్టూడియోస్ తరఫున జియో సినిమా యాప్ కోసం దేశవ్యాప్తంగా 100 సినిమాలు సిరీస్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఆ చిత్రాలు సిరీస్ అన్నీ కూడా త్వరలోనే జియో సినిమా షాపులో రాబోతున్నాయని కొన్ని సినిమాలు థియేటర్లు విడుదలయ్యాక రాబోతున్నాయని దీన్ని పూర్తిస్థాయిగా ఓటీటి గా మార్చి ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని జియో సంస్థ భావిస్తోంది. అంతేకాకుండా మరొక ఓటీటి పూట్ ని కూడా జియోలో కలిపేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ని మాత్రం ఫ్రీగా చూసేందుకు వీలు ఉంది కానీ సినిమాలను మాత్రం సబ్స్క్రయిబ్ చేసుకుని ప్లాన్ ని ప్రవేశపెడుతున్నట్లు ఇటీవలే ప్రకటించడం జరిగింది.

జియో పూట్ కలిసిన తరువాత ప్రేక్షకులకు సినిమాలు సిరీస్ లు అన్ని భాషలలో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీటి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను కూడా వైరల్ గా అవుతున్నాయి. రోజుకి రెండు రూపాయలు మాత్రమే తీసుకొని జియో సినిమా రోజువారి సబ్స్క్రిప్షన్ను కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. రూ 2రూపాయలతో రెండు డివైజ్ లకు కనెక్ట్ చేసుకోవచ్చట. అలాగే రూ  99 రూపాయలకు మూడు నెలలు సబ్స్క్రిప్షన్.. ప్లాంతోపాటు రెండు డివైస్లు ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. రూ.599 రూపాయలకు ఏడాది సబ్స్క్రిప్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీటిని నాలుగు డివైస్లలో వాడుకొనేలా జియో సినిమా త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ జియో ప్లాన్ ఫొటోస్ అధికారికంగా మే మూడో వారం నుంచి ప్రేక్షకులకు అందించబోతున్నట్లు సమాచారం. దీంతో ఇతర ఓటిటి సంస్థలు యూజర్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: