నీ మొహానికి నువ్వు హీరోయినా అన్నారు : సౌదామిని

praveen
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో ఎక్కడ చూసినా బలగం సినిమాకు సంబంధించిన నటులే కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి నటించగా.. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది.

 ఇకపోతే ఈ సినిమాలో హీరో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పాత్రలో సౌదామిని అనే నటి కనిపిస్తూ ఉంటుంది. హీరో తాత చనిపోయినప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి వస్తుంది. చావు ఇంట్లో ఆమెకు ప్రియదర్శి మర్యాదలు చేసే సీన్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఆ తర్వాత ప్రియదర్శి, సౌదామిని ఇద్దరి మీద వచ్చే ఒక సాంగ్ అయితే మరింతగా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌదామిని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

 నేను బలగం సినిమాలో ఛాన్స్ కోసం మా అన్నయ్యని తీసుకొని వేణు ఆఫీస్ కి వెళ్ళాను. అయితే ఆయన నన్ను సిగ్గుపడుతూ నటించి చూపించమన్నారు. ఇక ఆయన చెప్పినట్లుగానే నేను నటించాను.. నా నటన నచ్చి ఆయన ఓకే చేశారు. డైరెక్టర్ వళ్ళనే నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఫోన్ చేసి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు అంటూ సౌదామని చెప్పుకొచ్చింది. నీ ఫేస్ కి నువ్వు హీరోయిన్ అవుతావా అని ఎంతోమంది దారుణంగా కామెంట్ చేశారని.. కానీ నేనేం అవేమీ పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది సౌదామిని. మరి సౌదామని ఫ్యూచర్లో సినిమాల్లో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: