గేమ్ చేంజర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించనున్న బాలీవుడ్ యాక్టర్ ...!!
స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌సీ 15 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ లో అయితే నటిస్తోంది. గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ తో ఫైట్ చేసే విలన్‌గా ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా తెరపైకి వచ్చింది. తాజా టాక్ ప్రకారం బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడని తెలుస్తుంది.
తెలుగులో అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా లో కూడా మెరిశాడు హ్యారీ జోష్ హిందీలో ధూమ్ 2, గోల్‌మాల్ 3, టార్జాన్ ది వండర్ వార్, కిస్నా, ముసాఫిర్ అలాగే సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రాలతోపాటు పంజాబీ, కన్నడ, మరాఠీ సినిమాల్లో కూడా నటించాడు. హ్యారీ జోష్ గేమ్ ఛేంజర్‌తోపాటు లక్ష్మి మంచు నటిస్తోన్న ఆది పర్వంలో కూడా విలన్‌గా నటిస్తున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో రాజోలు భామ అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్ మరియు సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాతో శంకర్ ఒక భారీ విజయం సాధించాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. రాంచరణ్ తో మొదటి సారి ఒక తెలుగు సినిమాను తీస్తున్నాడు శంకర్…