మరో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న రాజమౌళి...!!

murali krishna
గత సంవత్సరం మార్చి 25న విడుదల అయ్యి వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న పాన్ ఇండియన్ చిత్రం ''రౌద్రం రణం రుధిరం''( rrr )..
ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. ప్రపంచ ఆ
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా పలు అంతర్జాతీయ పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ ను కూడా అందుకుంది.. ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీను మన డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం మన తెలుగు వారికీ ఎంతో గర్వకారణం..
స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమాను భారతీయ సినిమాకు కూడా ఎంతో గర్వకారణం అని అందరం చెప్పుకుంటున్నాం.. మరి ఇలాంటి భారీ మల్టీ స్టారర్ తర్వాత ఇప్పుడు రాజమౌళి తన తరువాత సినిమాను మహేష్ బాబు  తో చేయబోతున్నాడు అనే సంగతి తెలిసిందే.. ప్రెజెంట్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంత వరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు అని ఇప్పటికే టాక్ నడుస్తోంది.రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ తో చాలా బిజీగా ఉన్నారు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా కథ సాగుతుంది అని ఆ మధ్య విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కూడా మల్టీ స్టారర్  అని తాజాగా ఒక కొత్త రూమర్ కూడా వైరల్ అవుతుంది.. ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఏదొక రూమర్ అయితే వినిపిస్తూనే ఉంది.. తాజాగా ఇది కూడా మల్టీ స్టారర్ సినిమానే అని ఇందులో ఎన్టీఆర్   కూడా ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నారు అంటూ వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి.. అయితే ఈ రూమర్స్ లో నిజమెంత ఉందో మరీ తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: