గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

murali krishna
కెరీర్ మొదటిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోగా విజయవంతంగా తన కెరీర్ ను కొనసాగించిన వాళ్లలో గోపీచంద్ కూడ ఒకరు.
ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని గోపీచంద్ మే నెల 5వ తేదీన రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తుంది.. శ్రీవాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం అలాగే గోపీచంద్ శ్రీవాస్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో ఈ కాంబోలో తెరకెక్కిన రామబాణం మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతోంది.
రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజ గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా ఒకటి విడుదలైంది. రామబాణం టైటిల్ ను బాలయ్య గారితో అనౌన్స్ చేయించారని ఆయనతో అనౌన్స్ చేయించడానికి కారణమేంటని తేజ గోపీచంద్ ను అడిగారట.. శ్రీవాస్ తో ఎన్నో సినిమా చేస్తున్నావని తేజ గోపీచంద్ ను  ప్రశ్నించారట.నీకు బాగా నచ్చిన సినిమా ఏదని తేజ అడగగా జయం అని కూడా గోపీచంద్ సమాధానమిచ్చారు.
శ్రీవాస్ తో మీకు గొడవ నిజమేనా? అని తేజ గోపీచంద్ ను ప్రశ్నించారు. సినిమాల రిజల్ట్ నాకు తెలిసిపోతుందని ఏ సినిమా హిట్ గా నిలుస్తుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ముందే నాకు అర్థమవుతుందని గోపీచంద్ కామెంట్లు చేశారు. నేను నీ కోసం కథ సిద్ధం చేశానని హీరోయిన్ సెట్ కాలేదని అయితే ఆ సమయంలో నువ్వు ఫోన్ కూడా ఎత్తలేదని తేజ గోపీచంద్ తో చెప్పగా నేను చేసింది తప్పు అని గోపీచంద్ జవాబును ఇచ్చారు.
మీ నాన్నగారు చేసిన మంచి పనుల వల్ల జయం సినిమాలో నీకు ఛాన్స్ ను ఇచ్చానని తేజ గోపీచంద్ తో అన్నారు. మీ నాన్న గొప్పోడు? నువ్వేం పీకావ్? అని తేజ గోపీచంద్ ను తిరిగి ప్రశ్నించారు. ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఫుల్ ఎపిసోడ్ రేపు ప్రసారం కానుందని తెలుస్తుంది.. తేజ పదునైన ప్రశ్నలకు గోపీచంద్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారో మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: