రాజమౌళి ఈజ్ ఎ బ్రాండ్.. వారికి ఇన్స్పిరేషన్?

Purushottham Vinay
పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్ సినిమా దాకా ప్రేక్షకులని నిరాశపరచకుండా ఇంకా వారికి నచ్చే విధంగా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారనే సంగతి తెలిసిందే.సినిమాకి పెట్టే బడ్జెట్ విషయంలో అలాగే సినిమా క్వాలిటీ విషయంలో రాజమౌళి ఎప్పుడు కూడా అస్సలు రాజీ పడరనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం మన తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో చాలా పౌరాణిక, జానపద సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలకు ఒక విధంగా ఎస్ ఎస్ రాజమౌళి స్పూర్తి అని కామెంట్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. గుణశేఖర్, మణిరత్నం ఇంకా అలాగే మరి కొందరు డైరెక్టర్లు రాజమౌళి వల్లే తాము భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నామని కూడా వివిధ సందర్భాల్లో చెబుతున్నారు.తనకంటే ముందే కెరీర్ ను మొదలుపెట్టిన వాళ్లకు కూడా మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి స్పూర్తిగా నిలవడం గమనార్హం. ఇంకా ఎస్ ఎస్ రాజమౌళి వల్ల దర్శకుల పారితోషికాలు కూడా చాలా భారీగా పెరిగాయి. రాజమౌళి రాబోయే రోజుల్లో కూడా చరిత్ర సృష్టించే ఇంకా చరిత్ర తిరగరాసే సినిమాలు ఖచ్చితంగా తీస్తాడని అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.


ఇక గ్లోబల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక అద్భుతమైన కథతో సినిమా తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి తండ్రి ఇంకా ఫేమస్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.రాజమౌళి ప్రస్తుతం ఏకంగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారు.రాజమౌళి 2026 సంవత్సరంలో మహేష్ బాబు సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం తెలుస్తుంది. రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో తన తర్వాత సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం తెలుస్తోంది. జక్కన్న సూపర్ స్టార్ మహేష్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ సినిమాను సొంతం చేసుకోవాలని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లు కూడా చాలా భారీ రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం తెలుస్తుంది. ఎస్ ఎస్ సినిమాలు రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో భారీ కలెక్షన్లను కొల్లగొడతాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: