లాభాలబాటలో విరూపాక్ష.. ఆ భాషల్లో రిలీజ్ కి రెడీ?

Purushottham Vinay
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా బాగా సందడి చేస్తున్న 'విరూపాక్ష' సినిమా రోజురోజుకు కూడా తన సత్తా చాటుతూ చాలా స్పీడ్ గా దూసుకువెళ్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన తీరు అయితే ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేయడంలో మాత్రం 100 శాతం సక్సెస్ అయ్యింది.ఇక ఈ చిత్రాన్ని పూర్తిగా మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంతో చిత్ర యూనిట్ రూపొందించిన తీరు అయితే థియేటర్లలో ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. ఇంకా హార్రర్ ఎలిమెంట్స్ అనేవి ప్రేక్షకులని బాగా భయపడేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి.అందువల్ల ఈ విరూపాక్ష మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో, ఈ సినిమాకి ఇప్పుడు వసూళ్ల వర్షం కురుస్తోంది. చాలా రోజుల తరువాత తెలుగులో ఇలాంటి థ్రిల్లర్ సినిమా వచ్చిందంటూ 'విరూపాక్ష' సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు.


ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.50 కోట్ల మేర  వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.అలాగే బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకొని లాభాల బాటలోకి వచ్చేసింది ఈ మూవీ.ఇక యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా కావడంతో, ఆయన ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడని అభిమానులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా మున్ముందు ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అని చిత్ర వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించి ఎంతగానో మెప్పించింది. ఇక ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇమిడియేట్ గా తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: