ఏజెంట్ మూవీ నుండి "వైల్డ్ సలా" సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఆకరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార ...  మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ లుగా రూపొందినటువంటి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. 

ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అక్కినేని అఖిల్ హీరో గా నటించగా ... సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి హిప్ హప్ తమేజా సంగీతం అందించాడు. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఊర్వసి రౌటెల ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.

ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా  ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి "వైల్డ్ సాల" అనే వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ వీడియో సాంగ్ లో అఖిల్ ... ఊర్వసి వేసిన డ్యాన్స్ స్టెప్ లు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ వీడియో సాంగ్ లో ఊర్వశి అందాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: