పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకి 20 ఏళ్లు..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ "జానీ" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ మూవీ లో పవన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ ని నిర్మించాడు. రమణ గోగుల ఈ మూవీ కి సంగీతం అందించాడు. రమణ గోగుల ఈ మూవీ కి అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ మూవీ 25 ఏప్రిల్ 2023 వ తేదీన భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 20 ఏళ్లు అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయినప్పటికీ ఈ మూవీ లో పవన్ నటన కు అలాగే పవన్ ఈ సినిమాలో చేసిన యాక్షన్స్ సన్నివేశాలకు మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ లో పవన్ మరియు రేణు దేశాయ్ జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: