బాలయ్య విగ్గుల కోసం అన్ని లక్షలు ఖర్చు చేస్తారా..!?

Anilkumar
సాధారణంగా సినీ హీరోలు తమ తమ సినిమాలలో అందంగా కనిపించడం కోసం తమ హెయిర్ స్టైల్ లను రకరకాలుగా మెంటెన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న హీరోలు పెద్దగా విగ్గులను వాడడం లేదు. కానీ ఒకప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి ,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా చాలామంది సీనియర్ హీరోలు సినిమాల కోసం విగ్గులను వాడేవారు. ఇప్పుడున్న హీరోలు మాత్రం జుట్టు పెంచుకొని తమ సినిమాలకు తగ్గ హెయిర్ స్టైల్ ను చేసుకుంటూ ఉంటారు. అలా హీరోల మిగుల విషయానికొస్తే బాలకృష్ణ వాడే విగ్గులు చాలా స్పెషల్ అని అంటున్నాడు బాలకృష్ణ మేకప్ మెన్ వాసు. సాధారణంగా బాలకృష్ణ తన ప్రతి సినిమాలో కూడా విగ్గులను వాడుతూ ఉంటాడు. 

అయితే తాజాగా బాలకృష్ణ పర్సనల్ మేకప్ మెన్ వాసు బాలయ్య వాడే వికల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బాలకృష్ణ విగ్గుల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను బయటపెట్టాడు.ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ సాధారణమైన విగ్గులను వాడరు అని.. చాలా క్వాలిటీ విధులను వాడతారు అని బాలయ్య వాడే విగ్గులు చాలా కాస్ట్లీ  అంటూ పేర్కొన్నాడు వాసు.గతంలో అయితే బాలకృష్ణ వాడే విగ్గుల కోసం ముంబై లేదా చెన్నై నుండి తెప్పించేవారని.. కానీ ఎప్పుడు మాత్రం ఆ విగ్గులో హైదరాబాదులో కూడా దొరుకుతున్నాయి అంటూ పేర్కొన్నాడు.. ఇప్పుడు ఇక్కడ కూడా వివిధ రకాల విగ్గులు దొరుకుతున్నాయి అని.. బాలకృష్ణ వాడే విగ్గులన్నీ కూడా చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి అని.. నాసిరకం విగ్గులను బాలకృష్ణ ఎప్పుడూ వాడలేదు అని..

 బాలకృష్ణ వాడే విగ్గులు కోసం లక్షల్లో ఆయన ఖర్చు పెడుతుంటారు అంటూ చెప్పుకొచ్చాడు వాసు..ఇక ఆ విగ్గుల ఖర్చు మొత్తాన్ని కూడా ఆ సినిమా యొక్క నిర్మాతే భరిస్తారు అని కూడా తెలియజేశారు. ఇదిలా ఉంటే బాలయ్య ఎప్పటినుండో విగ్గులని వాడతారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. అంతేకాదు బాలకృష్ణ సినిమాల్లో విగ్ సెంటిమెంట్ కూడా ఉందని చెప్పొచ్చు. సినిమాలో ఆయన పెట్టుకున్న విగ్గు ఆయనకి సెట్ అయితే గనక కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాసు మాట్లాడుతూ విగ్గు సెంటిమెంట్ బాలకృష్ణ గారికి ఏమాత్రం లేదు అని కూడా చెప్పుకొచ్చాడు.బాలకృష్ణ సినిమాలో ఒకవేళ బాలయ్యకి ఆ విగ్గు గనుక సెట్ అయితే ఆయన మరింత అందంగా కనిపిస్తారు .అందుకే ఈ విగ్గు సెంటిమెంట్ రూమర్ వచ్చి ఉంటుంది అని కూడా తెలియజేశాడు వాసు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: