ఆ ఏరియాలో "గేమ్ చేంజర్" మూవీ క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం చిత్రీకరణ..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా బాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ శంషాబాద్ లో ప్రారంభం అయింది. ఈ తాజా షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ యాక్షన్స్ సన్నివేశాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

 అలాగే ఈ క్లైమాక్స్ ఫైట్ సన్నివేశంలో అనేక మంది ఫైటర్స్ రామ్ చరణ్ తో తలబడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశం అత్యద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఈ మూవీ లోని సాంగ్స్ మరియు యాక్షన్ సన్నివేశాలను ఈ చిత్ర బృందం భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు ... ఇవి అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: